సీఎం గారూ.. నలుగురికి చార్టెడ్ ఫ్లయిట్ అవసరమా? 

సీఎం గారూ.. నలుగురికి చార్టెడ్ ఫ్లయిట్ అవసరమా? 

చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చార్టెడ్ ఫ్లయిట్‌లో ప్రయాణించడం వివాదస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు మరో ఇద్దరితో కలసి సీఎం చన్నీ ఢిల్లీకి వెళ్లారు. అయితే సాధారణ ఫ్లయిట్‌లోనో లేదా కార్‌లోనో వెళ్లకుండా ఖరీదైన ప్రైవేట్ జెట్‌లో ఎందుకు వెళ్లారంటూ చన్నీపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

‘సాధారణ ప్రజల వైపున ఉంటామని కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. కానీ చండీగఢ్ నుంచి ఢిల్లీకి 250 కిలో మీటర్ల దూరం. అంత తక్కువ దూరం జర్నీకి మామూలు ఫ్లయిట్ లేదా కార్లను వాడాల్సింది. గాంధీ ఫ్యామిలీ పాటించే ఢిల్లీ దర్బార్ సంస్కృతిని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా? ’ అని శిరోమణి అకాలీదళ్ ప్రశ్నించింది. 

పేదోడు ఫ్లయిట్ ఎక్కొద్దా?
నలుగురు వెళ్లడానికి 16 మంది కూర్చునే జెట్‌ను ఎందుకు వాడారని సీఎం చన్నీని విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్ద అధికారికంగా 5 సీటర్ చాపర్ అందుబాటులో ఉన్నా.. దాన్ని ఎందుకు వాడటం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం చన్నీని పలువురు రిపోర్టుర్లు ప్రశ్నించగా ఆయన సీరియస్ అయ్యారు. పేదోడు ఫ్లయిట్‌ ఎక్కొద్దా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఫ్లయిట్ చార్జీలు ఎవరు చెల్లించారని అడగ్గా.. సమాధానం చెప్పకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని..కేటీఆర్ స్పందన

‘మా’ ఎలక్షన్స్: ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా?