అమరుల కుటుంబ సభ్యుల కాళ్లకు నమస్కరించిన సీపీ

 అమరుల కుటుంబ సభ్యుల కాళ్లకు నమస్కరించిన సీపీ

పోలీసు అమరవీరుల అమర త్యాగాలు అమూల్యమైనవి.. దేశం వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. అంబర్ పేట్ CAR ప్రధాన కార్యాలయం, పోలీసు అమరవీరుల దినోత్సవం  కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పోలీసు అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్  దగ్గర  1959 అక్టోబర్ 21 న చైనా సైనికుల దాడిలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 10 మంది సిఆర్‌పిఎఫ్ సైనికుల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా పోలీసు స్మారక దినోత్సవాన్ని జరుపుకున్నట్లు సీపీ  చెప్పారు. 

దేశాన్ని ప్రశాంతంగా ఉంచడానికి వందలాది మంది పోలీసు సిబ్బంది తమ జీవితాలను అంకితం చేశారని సీపీ గుర్తు చేశారు. ప్రస్తుత సంవత్సరంలో దేశంలో 377 మంది పోలీసులు తమ విధులను తమ జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ నుంచి 16 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ఉగ్రదాడిలో తన అమరుడైన కుటుంబ సభ్యులను సన్మానించి వారి  కాళ్లకు సీపీ నమస్కరించారు.