జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్​ ఎక్స్​పర్ట్స్ ఏం చేప్తున్నారు?

జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్​ ఎక్స్​పర్ట్స్ ఏం చేప్తున్నారు?

జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా? అనే విషయంలో ఇంట్లో జరిగే యుద్ధాలు ప్రతి ఒక్కరికీ పరిచయమే. జీవంలేని, చిట్లిన వెంట్రుకలకు నూనె పెడితే చెక్​ పెట్టినట్టే అంటారు ఇంట్లో ఉండే పెద్దవాళ్లు. ఇదే విషయాన్ని హెయిర్​ ఎక్స్​పర్ట్స్​ని అడిగితే ఏం చెప్పారో చదవండి...

పెట్టడమే మేలు

జుట్టుకు నూనె పెట్టడం వల్ల మల్టీ డైమెన్షనల్​ ఎఫెక్ట్స్​ ఉంటాయి అని డాక్టర్​ రోహిణి అంటున్నారు. ‘‘నూనె పెట్టడం వల్ల జుట్టు​ బలంగా ఉంటుంది. పెళుసు బారదు. జుట్టు చిట్లిపోదు. నూనె వెంట్రుకలకు కోటింగ్​లా ఉండడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి ప్రొటెక్టివ్​ లేయర్​ ఏర్పడుతుంది. జుట్టు బ్లో డ్రై చేసే అలవాటు ఉన్న వాళ్లు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు పెళుసుబారి, చిట్లిపోకుండా ఉంటుంది. అలాగే జుట్టుకి నూనె రాసుకునేటప్పుడు చేసే మసాజ్​ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మాడు మీద రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

మాడుకి పోషణ వస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగి, పోషణ అందితే జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. మర్దనా చేస్తూ నూనె రాయడం వల్ల ఒత్తిడితో పాటు జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. ఆముదం, ఆలివ్​ నూనె వంటి వాటిలో విటమిన్​– ఇ ఉంటుంది. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్​ జుట్టు కణాల చుట్టూ అడ్డుగోడలా ఏర్పడతాయి. దీనివల్ల జుట్టు తేమ కోల్పోదు. తేమ కోల్పోవడం వల్లనే కదా జుట్టు నిస్సారంగా, పొడిగా అవుతుంది” అన్నారు ఈ డాక్టరమ్మ.

అన్నిసార్లు సరి కాదు! 

శరీరం నుంచి విడుదలయ్యే నూనె వల్ల మాడుకి సహజంగా పీహెచ్​ అందుతుంది. అందుకే చాలామంది ఆయిల్ రాయొద్దంటారు అంటున్నాడు సెలబ్రిటీ హెయిర్​ స్టయిలిస్ట్​ రాడ్​ ఏంకర్​. 

‘‘నేరుగా మాడు మీద నూనె పెట్టడం వల్ల జుట్టు ఫాలికిల్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పీహెచ్​ లెవల్స్​ తగ్గిపోతాయి. మాడు మీద ఉండే పీహెచ్​ లెవల్​కు, జుట్టు ఊడటానికి మధ్య సంబంధం ఉంటుంది. అందుకని జుట్టు పొడిగా లేదా ఎక్కువ జిడ్డుగా ఉంటే జుట్టు ఊడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో పైనుంచి అదనంగా నూనె పెట్టడం వల్ల పరిస్థితి గందరగోళం అవుతుంది. ఇలాంటప్పుడు తలమీద నూనె పెట్టుకోవడం వల్ల నేచురల్​ ఆయిల్​ ప్రొడక్షన్​ ఆగిపోతుంది.

నేచురల్​ ఆయిల్స్​ నీళ్లలో కరగవు. అందుకే తల స్నానం చేసినా జుట్టుకు పట్టి ఉంటాయి. ఎండలోకి వెళ్లినప్పుడు ఆయిల్ కోటింగ్​ వల్ల సూర్యకిరణాలు ఆయిల్​ లేయర్​ను వేడెక్కేలా చేస్తాయి. వెంట్రుకల లోపలి నిర్మాణం వేడెక్కుతుంది. దాంతో వెంట్రుకల్లో ఉన్న తేమ అంతా పోతుంది. అంటే వెంట్రుక లోపల డ్రైగా అవుతుంది. జుట్టు పైకి మెరుస్తున్నట్టు ఉంటుంది. కానీ అది ఒక శాండ్​పేపర్​లా తయారవుతుంది. అందుకని లిన్​సీడ్​ నూనె రాసుకోవడం బెటర్​. ఇది 60 శాతం నేచురల్​గా ఉండి నీళ్లలో కరుగుతుంది. తలస్నానం చేసినప్పుడు జుట్టుని వదిలిపోతుంది.

ఇక తలకు నూనె పెట్టే విషయానికి వస్తే...  పూర్వం ఇప్పుడున్నంత కాలుష్యం లేదు. నిల్వచేసిన తిండి తినలేదు. రసాయనాలు, ట్రీట్​మెంట్స్​, ఆయిల్​తో చేసిన సెన్స్​ వంటివి వాడలేదు. అప్పట్లో అవి అసలు లేనే లేవు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి నూనె పెట్టుకున్నా షాంపూ చేయడం మర్చిపోవద్దు. లేదంటే బయటి చెత్తంతా మీ తల మీదకు చేరి... జుట్టు ఊడిపోతుంది. పాడైపోతుంది’’ అని హెచ్చరించాడు.