నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే

నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే

కాశీబుగ్గ (కార్పొరేషన్​), వెలుగు: నీటి సరఫరాలో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె వరంగల్ అండర్ రైల్వే జోన్ ప్రాంతంలో ధర్మసాగర్ 60 ఎంఎల్డీ ద్వారా జరిగే నీటి సరఫరాలో ఇటీవల అవాంతరాలు ఏర్పడగా బల్దియా ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.

అనంతరం ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ పరిశీలించి నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ రాజయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్ కుమార్, డీఈ సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఎంపీ ఎన్నికల సందర్భంగా సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తెలిపారు.