ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.
ఒంటిమిట్ట కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 7.30 గంటల నుంచి 9 .30గంటల వరకు... సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
- మార్చి 27 (శ్రీరామ నవమి): వృషభ లగ్నంలో ఉదయం 9.30 – 10.15 గంటల మధ్య ధ్వజారోహణం.. ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం.
- మార్చి 27 సాయంత్రం 7 గంటలకు శేష వాహనం
- మార్చి 28 : ఉదయం వేణుగాన అలంకారం.. సాయంత్రం హంస వాహనం
- మార్చి 29: ఉదయం వటపత్రసాయి అలంకారం .. సాయంత్రం సింహ వాహనం
- మార్చి 30: ఉదయం నవనీతకృష్ణ అలంకారం.. సాయంత్రం హనుమంత వాహనం
- మార్చి 31: మోహినీ అలంకారం.. సాయంత్రం గరుడసేవ
- ఏప్రిల్ 1 : ఉదయం శివధనుర్భాణ అలంకారం.. మధ్యాహ్నం 3.15 గంటలకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం.. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం.. రాత్రికి గజవాహనం.
- ఏప్రిల్ 2 : ఉదయం రథోత్సవం
- ఏప్రిల్ 3 : కాళీయమర్ధన అలంకారం ...సాయంత్రం అశ్వవాహనం
- ఏప్రిల్ 4 : చక్రస్నానం.. సాయంత్రం ధ్వజావరోహణం
- ఏప్రిల్ 5: సాయంత్రం 6 గంటల నుంచి పుష్పయాగం
