తిరుమల కొత్త ఈవో ... మద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణం

తిరుమల కొత్త ఈవో ... మద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణం

టీటీడీ ఈవోగా  ముద్దాడ రవిచంద్ర   శ్రీవారి ఆలయంలో శుక్రవారం ( మార్చి 6) ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో మద్దాల రవిచంద్ర  దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో  వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

►ALSO READ | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత

 నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని  ఈవో మద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. ఇప్పటికే  భక్తుల నుంచి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు.  భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.