తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం (మార్చి 06) కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా పడుతున్న మనోవేధన స్వామి దయవల్ల తీరిందని అన్నారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఇంటి పార్టీగా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు కవిత చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా అందరం బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు
