బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూషన్‌లో శనివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమకు సమర్పించారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే వివిధ స్కూళ్లలోనూ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి.
