రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో శ్రీ పార్వతి రాజజేశ్వర స్వామి వార్ల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోనీ శివ కళార్చన వేదిక వద్ద కల్యాణ వేదికలో అర్చకులు కల్యాణం జరిపించారు. స్వామి వార్ల కళ్యాణం తిలకించడానికి వేలాది భక్తులు, శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు తరలి వచ్చారు. స్వామి వారికి పట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగితే ఒక్క వేములవాడ లో మాత్రం కామదహనం తర్వాత శివుడి కళ్యాణం జరగడం అనవాయితీ. శివుడి వివాహంలో శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు, శివుడినీ పెళ్ళాడుతూ తస్మయం చెందడం విశేషం. జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా తరలి వచ్చినందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.. భీమేశ్వర ఆలయంలో దర్శన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీరు, శానిటేషన్, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేశారు.
ఐదు రోజులపాటు ఉత్సవాలు
ఇవాళ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కల్యాణం వైభవంగా కల్యాణం జరగ్గా..మార్చి5 నుంచి 9వరకు ఏకాంతంగా ఉత్సవాలు జరగనున్నాయి. 8న స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.
