VijayTrisha: త్రిషతో విజయ్ చెట్టాపట్టాలు.. భార్యతో విడాకుల వేళ దళపతి బిహేవియర్ వైరల్!

VijayTrisha: త్రిషతో విజయ్ చెట్టాపట్టాలు.. భార్యతో విడాకుల వేళ దళపతి బిహేవియర్ వైరల్!

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇది సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. విజయ్ వేరే నటితో సంబంధం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా విజయ్ చేసిన ఒక పబ్లిక్ ఎంట్రీ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. నటి త్రిష కృష్ణన్ తో కలిసి ఆయన ఒక వివాహ వేడుకకు హాజరుకావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

విడాకుల రచ్చ.. త్రిషతో ఎంట్రీ!

ప్రముఖ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం హాజరవ్వడమే కాకుండా, వీరిద్దరూ కలర్ కోఆర్డినేటెడ్ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు. విజయ్ గోల్డెన్ షర్ట్, వేష్టి ధరించగా.. త్రిష గోల్డెన్ శారీ, రెడ్ బ్లౌజ్‌లో మెరిసిపోయింది. ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఫోటోలకు పోజులివ్వడం, కలిసి వేదికపైకి వెళ్లడం చూస్తుంటే.. వస్తున్న రూమర్లను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.

సంగీత పిటిషన్‌లో సంచలన ఆరోపణలు

డిసెంబర్‌లో సంగీత దాఖలు చేసినట్లు చెబుతున్న విడాకుల పిటిషన్‌లో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి.  విజయ్ ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఆమెతో కలిసి విదేశీ ప్రయాణాలు చేస్తున్నారని సంగీత పేర్కొన్నారు. సదరు నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు తనకు "మానసిక వేదన"  కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఈ పబ్లిక్ ఎంట్రీతో పాటు ఆ నటి త్రిష అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. గతంలో కూడా వీరిద్దరు కలిసి విదేశాలకు వెళ్లడం వంటి ఫొటోలు కూడా ఆమె ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి.

►ALSO READ | Janhvi Kapoor: కాలి నడకన శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. వీడియో వైరల్

నెటిజన్ల ఆగ్రహం.. 

వీరిద్దరి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు "సౌత్ ఇండియాలో సెలబ్రిటీ వర్షిప్ ఆపాలి" అని డిమాండ్ చేస్తున్నారు. భార్య విడాకుల పిటిషన్ వేసిన తరుణంలో, ఇలా బహిరంగంగా త్రిషతో తిరగడం విజయ్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. కనీస గౌరవం, ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.  నెట్టింట విజయ్, త్రిషలపై పెద్ద చర్చే నడుస్తోంది.
 
భారీ మొత్తంలో భరణం?

ఈ విడాకుల వ్యవహారం సెటిల్ కావడానికి విజయ్ తన భార్య సంగీతకు భారీ మొత్తంలో భరణం చెల్లించాడనికి సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.  సుమారు రూ. 250 కోట్లు అలిమోనీగా ఇచ్చేందు అంగీకరించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  ఒకవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్న విజయ్, మరోవైపు ఇలాంటి వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకోవడం ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అందుకే కోర్టు బయటే ఈ విడాకుల వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో 'లియో' వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన విజయ్ త్రిష జోడీ, నిజ జీవితంలో ఇంతటి వివాదానికి కేంద్రబిందువు అవుతుందని ఎవరూ ఊహించలేదు.