బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, శుక్రవారం (మార్చి 6, 2026న) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ తన 29వ పుట్టినరోజు సందర్భంగా అలిపిరి మెట్లపై నడుచుకుంటూ తిరుమల కొండపైకి చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి ప్రయాణం ప్రారంభించిన జాన్వీ, కొండపైకి నడిచి చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం ఆమెకు విఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయగా, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి సైతం స్వామివారిని దర్శించున్నారు. సుమారు 11 కిలోమీటర్ల పొడవు, 3500కు పైగా మెట్లు ఉన్న ఈ పవిత్ర మార్గాన్ని భక్తులు విశ్వాసంతో ఎక్కి స్వామివారి దర్శనం పొందడం విశేషం.
Actress #JanhviKapoor visited Tirumala on foot to offer prayers and seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#PEDDI #TeluguFilmNagar pic.twitter.com/cDq0mlOFWI
— Telugu FilmNagar (@telugufilmnagar) March 6, 2026
అయితే, అలిపిరి వద్ద పూజలు చేసిన జాన్వీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి కుర్తా ధరించి చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని మెట్లు ఎక్కుతూ జాన్వీ కపూర్ కనిపింస్తూ ఆకట్టుకుంది.
►ALSO READ | Karmeni Selvam: తెలుగు–తమిళ భాషల్లో సముద్రఖని మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అయితే, పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జాన్వీకి చాలా ఇష్టం. గడిచిన పుట్టినరోజు నాడు కూడా జాన్వీ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కుతున్న వీడియో సైతం ఇపుడు వైరల్ అవుతోంది.
జాన్వీ కపూర్ పెద్ది:
రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో జాన్వీ కపూర్ సంప్రదాయ చీర, ఆభరణాలతో పాటు కూలింగ్ గ్లాసెస్ ధరించి, ఓ జీపుపై నిలబడి, జనం వైపు అభివాదం చేస్తూ కనిపించింది. సెకండ్ పోస్టర్ లో మైక్ ముందు నిలబడి ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఈ ఉన్న పోస్టర్లు చూసి అభిమానులు ఫిదా అవున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
— PEDDI (@PeddiMovieOffl) November 1, 2025
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/LFsESjTmYK
