సన్నతగాత్రి సఙ్ఞతం మనిషిభిసాప్తపదినముచ్యతే'. విద్వాంసులు సన్మైత్రిని ఏడు మాటలతో లభ్యమయ్యేదానిగా వర్ణిస్తున్నారని కాళిదాసు కుమారసంభవంలో చెప్పాడు. విద్వాంసులు అనేదానికి విస్తృతమైన అర్థం ఉంది. సర్వసాధారణంగా చెప్పుకోవాలంటే... మంచిచెడుల విచక్షణ తెలిసినవారు అని భావన చేయొచ్చు. అందువల్లే విద్వాంసులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని పండితులు చెప్తారు.
విద్వాంసులైన వారితో అవతలివారు మాట్లాడుతున్నప్పుడు... వారు మాట్లాడే ఏడు మాటలతో వారి మనోగతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆ మాటల్లోని అంతరార్ధాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ తరవాతే వారితో స్నేహం చేస్తారు. తొందరపడి అనర్హుడితో స్నేహం చేయరు. తమతో స్నేహం చేయడానికి అర్హత ఉంది . అని త్రికరణశుద్ధిగా నమ్మిన తరువాతే స్నేహం చేస్తారు. దానినే సన్నైత్రి అంటారు.
రామాయణంలో.... రామలక్ష్మణులు సీతా దేవిని అన్వేషిస్తూ, కిష్కింధలోకి ప్రవేశిస్తున్న సమయంలో, దూరం నుంచే వారిని గమనించాడు సుగ్రీవుడు. హనుమంతుడిని పిలిచి, 'హనుమా! ఆ వస్తున్న వారిని చూడు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. మా అన్న వాలి నా మీదకు వారిని యుద్ధానికి పంపించి ఉంటాడు. నువ్వు వెళ్లి విషయం కనుక్కునిరా' అని భయం భయంగా మాట్లాడుతూ హనుమను పంపుతాడు.
హనుమంతుడు మారువేషంలో రామలక్ష్మణుల ను సమీపించి, 'మహానుభావా! మీరు ఎవరు? మీ వేషధారణ చూస్తుంటే సామాన్యుల వలె ఉన్నారు. కానీ, మీ చేతిలోని ధనుర్బాణాలు చూస్తుంటే రాజ వంశానికి చెందినవారిలా ఉన్నారు. మీరెవరో చెప్పండి' అని వినయంగా ప్రశ్నించాడు.
హనుమ మాటలకు ముగ్ధుడైన రాముడు, పక్కనే ఉన్న లక్ష్మణుడితో, 'సౌమిత్రీ! సకల విద్య లను అభ్యసించినవారు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలరు. ఇతనితో స్నేహం చేయటం వలన మనం వెతుకుతున్న సీతమ్మను త్వరగా చేరుకోగలుగుతాము.
ఇంతటి వాక్య విశారదుడి వలన పనులన్నీ సానుకూలపడతాయి. ఈతనితో మైత్రి చేద్దాం' అని పలికాదు. అలా హనుమంతుని మాటలను అర్థం చేసుకుని, చేసిన మైత్రి... సన్నై త్రి అయింది. సీతమ్మను చేరుకోవటానికి హనుమ చేసిన కృషి ఫలించింది. అలాగే సుగ్రీవునితో స్నేహం కూడా అటువంటిదే. రామలక్ష్మణులతో మాట్లాడిన తరువాత హనుమంతుడు వారిని తన వెంట సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్లాడు.
సు గ్రీవునితో స్నేహం చేయటం వల్ల అంతా మంచి జరుగుతుందని అంతకుముందే మహర్షి చెప్పిన మాటలు రాముని మదిలో స్ఫురించాయి. కానీ, తాను నిర్ధారించుకోవాలి అనుకున్నాడు.
రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు, వారి సాయంతో వాలిని అంతమొందించాలి అనుకున్నాడు. తన మనసులోని మాటను బయటపె ట్టాడు.
'రామా! వాలిని సంహరిస్తే, నేను ప్రాణ భయంలేకుండా జీవించగలుగుతాను, స్వేచ్చగా, హాయిగా ఉండగలుగుతాను. అప్పుడు నువ్వు ఏ సాయం కోరినా చేయగలిగే స్థితిలో ఉంటాను' అని సౌమ్యంగా పలికాడు.
సుగ్రీవుడు పలికిన నాలుగు మాటలతోనే రాముడు అతడిలోని నిజాయితీని అర్థం చేసుకు న్నాడు. సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి చేశాడు. ఆ తరవాత వాలిని సంహరించాడు. కృతజ్ఞతతో సీతమ్మను వెతికే పనిని వానరులకు అప్పగించా డు. లంక మీద వారధి నిర్మింపచేశాడు. రావణ సంహారంలో సహకరించాడు. సీతారాములనుకలపగలిగాడు. సన్నైతి వల్ల కలిగే శుభపరి ణామాలకు ఇది చక్కటి ఉదాహరణ.
►ALSO READ | ఆధ్యాత్మికం: గుళ్లో చెప్పులు మాయం.. దరిద్రం పోయినట్టే..ఇంట్లోకి లక్ష్మీ దేవి ఆహ్వానించినట్టే..!
రామాయణం యుద్ధకాండలో... రావణుడికి నీతి బోధ చేసి భంగపడతాడు విభీషణు డు. లంకా రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు రావణుడు ఏ విధంగానైనా రాముడితో స్నేహం చేయాలనే ఆలోచనలో ఉంటాడు. విభీషణుడు. అందుకే నేరుగా రాముడు ఉన్న శిబిరానికి చేరుకుంటాడు. తాను మైత్రి చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అందుకు లక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలైన వారంతా నిరాకరిస్తారు. కానీ, హనుమంతుడు మాత్రం, విభీషణుడి మాటతీరును గమనించి, 'అతడితో స్నేహం చేయటం శ్రేయస్కరం' అని రాముడికి సూచిస్తాడు. అలా విభీషణుడితో స్నేహం చేయటం వల్ల. లంకారాజ్యాన్ని చేరుకోవటం, కుంభకర్ణుడిని సంహరించటం వంటి పనులన్నీ సులువుగా జరిగిపోయాయి. సన్మైతి వలన కష్టాలను అతిసులువుగా అధిగమించవ చ్చు అనటానికి ఇంతకుమించిన మంచి ఉదాహరణ చరిత్రలో కనిపించడు.
పిల్లల ప్రవర్తన చెడుగా ఉంటే, వెంటనే 'మా పిల్లవాడు.. పిల్ల స్వతహాగా చాలా మంచివారు. కానీ, స్నేహితుల వల్ల చెడిపోయారు' అని పరులను నిందిస్తుంటారు. స్వతహాగా సద్భావన. సదాలోచనలు ఉన్నవాళ్లు... ఎవరి ప్రభావానికీ లొంగరు. వారిలో వచ్చే చెడు మార్పుకి స్నేహితులు కారణం అవ్వరు.
అందుకే ఇక్కడ విద్వాంసు లు అనే పదాన్ని ఉపయోగించాడు కాళిదాసు. వ్యక్తిగతంగా జ్ఞానసంపన్నులైనవారు సన్మైత్రినే కోరుకుంటారు. అవతలివారి మాటల్లోని నిజాయితీని గ్రహించిన తరువాతే వారు స్నేహం చేస్తారని కాళిదాసు వ్యక్తిత్వ వికాసాన్ని కుమార సంభవం పంచమసర్గలో బోధించాడు.
అదేవిధంగా స్నేహ ధర్మం వల్ల అవతలివారిని ప్రశ్నించే హక్కును సంపాదించుకుంటారని కూడా చెప్పాడు కాళిదాసు. సన్నైతితో సాధించలేనిది లేదు. అందుకే నేటికీ ప్రపంచ దేశాల్లో ఒక దేశంతో మరో దేశం సన్నైత్రిని కోరుకుంటోంది.
-వెలుగు,లైఫ్–
