జనగామలో  మార్చి 6న  జాబ్మేళా

జనగామలో  మార్చి 6న  జాబ్మేళా

జనగామ అర్బన్, వెలుగు :  జనగామ జిల్లా ఉపాధి కల్పనా ఆఫీస్​, డీఆర్డీఏ ఆధ్వర్యంలో  శుక్రవారం ప్రైవేట్​ కంపెనీలో జాబ్​ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి  పి. సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  హైద్రాబాద్​ కు చెందిన మహేంద్ర అండ్​ మహేంద్ర లిమిటెడ్​ కంపెనీ లో మొత్తం 300 ఉద్యోగాలకు  ట్రైనింగ్​ కం ప్లేస్​మెంట్స్​ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అర్హత, ఆసక్తి గలవారు   ఉమ్మడి వరంగల్​ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్​ కాపీలతో 6వ తేదీ ఉదయం 10.30  గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు జనగామ మున్సిపల్​ కాన్పరెన్స్​ హాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సీనియర్​ అసిస్టెంట్​ జె. గీత సెల్​ నంబర్​ 7995430401 సంప్రదించాలని తెలిపారు.