Big Breaking: తిరుమల శేషాచలం కొండల్లో కార్చిచ్చు.. విండ్మిల్ ప్రాంతంలో చెలరేగిన మంటలు

Big Breaking: తిరుమల శేషాచలం కొండల్లో కార్చిచ్చు.. విండ్మిల్ ప్రాంతంలో చెలరేగిన మంటలు

తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అలముకుంది. కాకులమాను అటవీ ప్రాంతంలో మంటలు అధికంగా వ్యాపించాయి.విండ్మిల్ ప్రాంతానికి ఆనుకొని మంటలు చెలరేగాయి.  సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేసవికాలం‌ కావడంతో అటవీ ప్రాంతంలో  అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది. అధికంగా మంటలు వ్యాప్తి చెందడంతో అటవీ ప్రాంతంలో నివసించే వన్య ప్రాణులు మృతి చెందే అవకాశం ఉండడంతో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు.