మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..

మహాద్భుతం: తిరుమల తిరుపతి   దేవాలయం  రహస్యాలు ఇవే..

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.  మరితిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం  గురించి  ఎవరికి తెలియని  విశేషాలు తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. మళ్లీమళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇది భారతదేశంలో రెండవ అత్యంత ధనిక దేవాలయం. కలియుగ కష్టాల నుంచి మానవాళిని రక్షించేందుకే శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినట్లు భక్తులు నమ్ముతారు. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. . దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. 

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి గుడి రహస్యాలు

తలనీలాల సమర్పణ వెనుక రహస్యం: పురాణాల ప్రకారం..వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు వుంటుంది. ఇది అస్సలు చిక్కు పడదని అంటారు.   విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి, పుట్టలో ఆవాసం ఏర్పర్చుకున్నాడు.  అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి వేటుకు శ్రీవారి తలకు గాయమైంది. దీంతో గాంధర్వ  యువరాణి నీలా దేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది. తన జుట్టు కత్తిరించి, స్వామికి సమర్పించి.. గాయమైన స్థానంలో ఉంచమని కోరింది.ఇందుకు ఆయన అంగకరించి జుట్టు కోల్పొయిన ప్రాంతంలో అతికిస్తారు.  నీలాదేవి భక్తికి మెచ్చిన వేంకటేశ్వరుడు, తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికీ తన ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు. అప్పటి నుంచే స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది.

వేంకటేశ్వరుని కళ్లు మూసి ఉంచడం: తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు. తెల్లని గుడ్డ కడతారు. స్వామికి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లు ఉంటాయి. ఆయన కళ్లు విశ్వశక్తికి మించినవని, అందుకే భక్తులు స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు. అందుకే వేంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు. అయితే ప్రతి గురువారం స్వామి కళ్లకు ముసుగును మారుస్తారు. ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామి కళ్లను నేరుగా చూడగలరు.

తడిగా ఉండే విగ్రహం: శ్రీవారి విగ్రహం వెనుక, వెన్ను భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.. 

పంచె, చీరతో స్వామి వారి అలంకారం: స్వామివారు గర్భగుడి మధ్యలో వున్నట్లు కనిపిస్తారు. అయితే, ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు. స్వామివారిని రోజూ కింద పంచె, పైన చీర తో అలంకరిస్తారు.

స్వామి కిరీటం: తిరుపతి వేంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరు పచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు. 3 అంగుళాల వ్యాసం ఉండే ఈ 96 క్యారెట్ మేరు పచ్చ, ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా (emerald) నిలుస్తోంది.

శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలల శబ్దం: శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలల శబ్దం: తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు.  స్వామి వారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది.

వేంకటేశ్వరుని విగ్రహం: తిరుమల వేంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం పెడతారు. సాధారణంగా దీనికి రాళ్లను పగులగొట్టి, చీల్చే స్వభావం ఉంటుంది. కానీ పచ్చ కర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలువారుతుంది. అయితే, శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా.. చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే, ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారీన్‌హీట్ ఉంటుందట. అయితే, ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది

దీపాల రహస్యం: తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజూ కొండెక్కవు. అవి కొన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే.ఈ దీపాలను వెలిగించిన సమయం, వెలిగించిన వ్యక్తులు ఎవరో తెలియదు.

స్వామివారి అభిషేకానికి వాడే పాలు :  గర్బగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిమీల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయబద్దంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే, ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి.

స్వామి వారి గడ్డానికి గంధం : బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది.

స్వామికి అలంకరించిన పూలు :  సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే, శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు.. తిరుపతికి దాదాపు 20 కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు.

స్వామి గుండెపై లక్ష్మీదేవి: వేంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీ దేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేప్పుడు.. లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది.

19వ శతాబ్దంలో స్వామి ప్రత్యక్షం:19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్లపాటు మూసివేశారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు.