టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఓటమి 

V6 Velugu Posted on Aug 05, 2021

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. బెలారస్ ప్లేయర్ వనెసా కలాజిన్ స్కయా చేతిలో 3-9తో ఓటమిపాలైంది.అయితే కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే అవకాశముంది. టోక్యోలో ఆమెకు మరో అవకాశం ఉంది.

టోక్యో ఒలింపిక్స్ 53 కిలోల కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్, తొలి రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలతో బరిలో దిగిన వినేష్ పోటీ మధ్యలో గాయపడింది. గాయం తీవ్రత కారణంగా లేవడానికి కూడా కష్టపడిన వినేష్.. ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలిసి వచ్చింది. 2016లో 50 కిలోల కేటగిరీలో పోటీపడ్డ వినేష్, 2019 లో 50 కిలోల కేటగిరీ నుండి 53 కిలోల కేటగిరీకి మారింది.

Tagged Tokyo Olympics, wrestler Vinesh Phogat, Defeat, quarter final

Latest Videos

Subscribe Now

More News