సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరిదైనా సెల్ ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్‌లో రిజిస్ట్రేషన్ చేయాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ సూచించారు. సోమవారం సీపీ ఆఫీస్‌లో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌పై జిల్లాలో ఉన్న రిసెప్షనిస్టులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయిన ఫోన్‌ను వెతికి పట్టుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఫోన్ పోయిన వారు <www.ceir.gov.in> వెబ్ సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఎస్సై శ్రీకాంత్, ఐటీ సెల్ కానిస్టేబుల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

