V6 News

చిన్నారులు, మహిళల రక్షణ కోసం.. హైదరాబాద్ సిటీలో ‘‘స్పందన టీమ్స్’’

చిన్నారులు, మహిళల రక్షణ కోసం.. హైదరాబాద్ సిటీలో ‘‘స్పందన టీమ్స్’’
  • చిన్నారులు, మహిళల రక్షణ కోసం వేగంగా స్పందించే స్పందన టీమ్స్
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 
  • చిన్నారులు, మహిళల తక్షణ రక్షణకు డయల్ 100/112

హైదరాబాద్ సిటీ పరిధిలో మహిళలు, చిన్నారుల తక్షణ రక్షణకు స్పెషల్ పోలీస్ టీమ్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా స్పందన టీమ్స్ పనిచేయనున్నాయి. అత్యవసర సహాయం కోసం మహిళలు, చిన్నారులు 100 లేదా 112 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని, ఫిర్యాదులపై ఆలస్యం లేకుండా స్పందన టీమ్స్ వెంటనే చర్యలు తీసుకుంటాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  

సోమవారం ( ఏప్రిల్ 27) సాయంత్రం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మహిళలు, చిన్నారులు తక్షణ రక్షణకు స్పందన టీమ్స్ ను అందుబాటులోకి తెచ్చారు.  ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మహిళలపై నేరాలను తగ్గించే ప్రయత్నంగా  ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకం పెంచే కార్యక్రమం స్పందన  అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.