V6 News

పశ్చిమ బెంగాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్

పశ్చిమ బెంగాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత (చివరి దశ) ఎన్నికల ప్రచారం సోమవారం (ఏప్రిల్ 27, 2026) ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం తర్వాత మైకులు మూగబోయాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అగ్ర రాజకీయ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీలో గుప్పించాయి. చివరిరోజు ప్రచారంలో అటు బీజేపీ సీనియర్ నేతలు ఇటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 29న రెండో దశలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతలు అమిత్ తోపాటు పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీ నేతలు మమతా బెనర్జీ  చివరి రోజు (సోమవారం)  విస్తృతంగా  రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఉత్తర 26 పరగణాల జిల్లాల్లోని కంకినరాలో ర్యాలీ నిర్వహించగా.. అమిత్ షా షుగ్లీ జిల్లాల్లోని చందన్ నగర్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. యోగి ఆదిత్యానాథ్, అశ్విని వైష్ణవ్ సహా ఇతర బీజేపీ నేతలు రాష్ట్రంంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా  ప్రచారం చేశారు. 

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో రోడ్‌షో నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హుగ్లీలోని ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించి, అనంతరం మహేష్‌తలాలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.