ఆస్తులు వేలం వేయనున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్

ఆస్తులు వేలం వేయనున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వద్ద చాలా కాలంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. పీఎన్బీ ఈ-ఆక్షన్ విభాగం ఆధ్వర్యంలో రేపు ఇ-వేలం నిర్వహించనున్నారు. ఇల్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కమర్షియల్ కాంప్లెక్సులు తదితర వాణిజ్య సముదాయాలను ఇ-వేలం వేయనున్నట్లు పీఎన్బీ ప్రకటించింది. ఇ-బిక్రి పోర్టల్ లెక్కల ప్రకారం 12 వేల 855 నివాసాలు, 2 వేల 804 కమర్షియల్ స్థలాలు, 1400 పారిశ్రామిక ఆస్తులు, 101 వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే బిడ్డర్లు విధి విధానాలు పాటించాలంటూ సూచనలు చేసింది. దీని ప్రకారం బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
మొబైల్ ఫోన్ ద్వారా ఈ-ఆక్షన్ ప్లాట్ ఫామ్ పై రిజిస్టర్ చేసుకోవాలి. 
కేవైసీ తనిఖీ కోసం రుజువు పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
అప్ లోడ్ చేసిన పత్రాలను ఇ-ఆక్షన్ సర్వీస్ ప్రొవైడర్ తనిఖీ పూర్తి చేస్తారు
తనిఖీ అనంతరం ఈఎండీ డిపాజిట్ ను ఆన్ లైన్ లోనే బదిలీ చేయాలి. 
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఇ-ఆక్షన్ ప్లాట్ ఫామ్ లో బిడ్లను దాఖలు చేయాలి.