నిత్యావసరాల ధరల పెంపుపై 18న ర్యాలీ

నిత్యావసరాల ధరల పెంపుపై 18న ర్యాలీ

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ చేవెళ్లలో 18న ర్యాలీ చేస్తామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత సామాన్యులు అప్పులు పాలు అవుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని చెప్పారు. యూపీలో రాహుల్, ప్రియాంక పాదయాత్రకు మద్దతుగా చేవెళ్లలో పాదయాత్ర ఉంటుందని.. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ పాల్గొంటారన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకి నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మల్లురవి.