ఒకేసారి టాటా డిజిటల్​లోకి రూ.5,882 కోట్ల పెట్టుబడులు

ఒకేసారి టాటా డిజిటల్​లోకి రూ.5,882 కోట్ల పెట్టుబడులు
  •     2021–22 లో రూ. 11,872 కోట్లను ఇన్వెస్ట్ చేసిన టాటా సన్స్‌‌‌‌
  •     ఈ–కామర్స్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌పై ఫోకస్​

న్యూఢిల్లీ: అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లకు పోటీగా తెచ్చిన ఈ–కామర్స్ కంపెనీ టాటా డిజిటల్‌‌‌‌లో  టాటా సన్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.  తాజాగా రూ. 5,882 కోట్లను ఒకే ట్రాన్సాక్షన్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని చూడొచ్చు. దీంతో  2021–22 లో  టాటా డిజిటల్‌‌‌‌లో మొత్తం రూ. 11,872 కోట్లను ​ టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసినట్టు అయ్యింది. టాటా సన్స్ ఈ–కామర్స్​ కంపెనీలో ఒకే ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఇంతలా ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. టాటా డిజిటల్‌‌‌‌ తాజాగా టాటా న్యూ యాప్‌‌‌‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, క్రోమా, టాటా క్లిక్‌‌‌‌,  బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌, 1ఎంజీ వంటి కంపెనీలు ఈ కంపెనీకి సబ్సిడరీలు. టాటా సన్స్‌‌‌‌కు రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న రూ. 5,882 కోట్ల విలువైన ఫుల్లీ పెయిడప్‌‌‌‌ ఈక్విటీ షేర్లను  ఇష్యూ చేయడానికి టాటా డిజిటల్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.  ఈ నెల 7 న టాటా న్యూ యాప్‌‌‌‌ను కూడా ఈ కంపెనీ తెచ్చింది.  

గతంలో రూ. 5,990 కోట్లు..

2021–22 ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో రూ.5,990 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసింది.  కాగా, మార్చి 31 నాటి డేటా ప్రకారం, టాటా డిజిటల్‌‌‌‌ ఆథరైజ్డ్ క్యాపిటల్‌‌‌‌ను  రూ. 11,000 నుంచి రూ. 15,000 కోట్లకు పెంచింది. టాటా డిజిటల్‌‌‌‌కు ఉన్న అప్పులను తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు ఈ క్యాపిటల్‌‌‌‌ను వాడతారు. ‘ఒకే సారి రూ. 5,882 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్‌‌‌‌ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ ఏర్పడినప్పటి నుంచి చేసిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లలో ఇది సగం కావడం గమనించాలి’ అని అల్టోఇన్ఫో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మోహిత్ యాదవ్‌‌‌‌ అన్నారు. ఈ–కామర్స్‌‌ సెగ్మెంట్‌‌పై సీరియస్‌‌గా ఉన్నామనే సంకేతాలను టాటా గ్రూప్‌‌ ఇస్తోందని చెప్పారు.