
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ వాట్సప్ యూనివర్సిటీని నడుపుతున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం తచ్చారని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు, వరంగల్ రైల్వే కోచ్ ఏం చేశారని నిలదీశారు. అబద్ధాల పోటి పెడితే బీజేపీ నేతలతో ఎవ్వరూ పోటీ పడలేరని విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో పీహెడీ చేశారని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేయని బీజేపీ లక్షల కోట్ల నిధులు గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ మూడో సారి అధికారంలోకి రావాలని 400 సీట్లు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఆ 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అడుగుతున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుందని అందుకే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టారని తెలిపారు. 2021లో ఎందుకు జనాభా లెక్కలు చేయలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని నిలదీశారు. గాంధీ కుటుంబానికి పదవులపై వ్యామోహం లేదని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే కానీ రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచడమే కాకుండా బలహీనవర్గాల కులగణన కాంగ్రెస్ చేస్తుందని చెప్పారు.
ఆయన, ఈయన కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. పాలకుర్తి లిఫ్ట్, రామగుండంలో 800 యూనిట్ల పవర్ జనరేషన్, నేతకాని కార్మికులకు కార్పోరేషన్, మంచిర్యాలలో మల్టీస్పెషలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వంశీని రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించండని కోరారు. కార్మికుల కోసం కాకా ఎంతో చేశారని అన్నారు. స్పీకర్ పదవికే శ్రీపాద రావు వన్నె తెచ్చారని గుర్తు చేశారు. విలువలతో కూడుకున్న రాజకీయం చేశారని తెలిపారు. కొప్పుల ఈశ్వర్ కు ఓటు అడిగే నైతక హక్కు లేదని ఆరోపించారు.