వివాదంగా మారిన కూకట్ పల్లి కుక్కల సమస్య

 వివాదంగా మారిన కూకట్ పల్లి  కుక్కల సమస్య

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో తలెత్తిన వీధి కుక్కల సమస్య గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలకలం సృష్టించింది. కేసుల వరకు వెళ్లింది. కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కూడా జోక్యం చేసుకోవడం కుక్కల సమస్య వివాదంగా మారింది. ఏడాది నుంచి మలేషియన్ టౌన్ షిప్ రెయిన్ ట్రీ పార్కులో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వారితో పాటు టూ వీలర్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. దీంతో మలేషియన్ టౌన్ షిప్ సభ్యులు వీధి కుక్కలను ఓ సంస్థకు దత్తతకు అక్కడి నుంచి తరలించారు. అయితే పీపుల్స్ ఫర్ యానిమాల్స్ సంస్థ ప్రతినిధులు అక్రమంగా కుక్కల దత్తతు జరిగిందని KPHB పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతినిధులు కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారన్నారు మలేషియన్ టౌన్ షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్. కుక్కల సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.