
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. “SSMB 29” మూవీలో నటించబోయే పలు భాషల నటుల గురించి చాలా రోజులుగా పెద్దఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. ఈ సోషల్ మీడియా రూమర్స్ పై SSMB 29 యూనిట్ స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ నుంచి తాజాగా నోట్ రిలీజ్ చేశారు." ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ (టైమ్స్ ఆఫ్ ఇండియా) మా చిత్రం (SSMB 29) కాస్టింగ్ గురించి ప్రచురించిన కథనం మా దృష్టికి వచ్చింది.మా ఈ చిత్రంలో వీరేన్ స్వామికి ఏ భాగానికి ,ఏ విధంగానూ ప్రమేయం లేదని తెలిపింది.మా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటనలు మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తే తప్ప ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని చిత్ర యూనిట్ ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం శ్రీ దుర్గ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ చేసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.ఇప్పటికే మహేశ్ లుక్‌కు సంబంధించిన స్కెచ్‌లు పూర్తవగా, వాటిల్లో ‘ది బెస్ట్’ను రాజమౌళి, ఆయన టీమ్ సెలక్ట్ చేసి, ఫైనల్ చేయనున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.
అలాగే ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగా షూటింగ్ కి ముందే మహేష్ మూవీ థీమ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ఎలా జరగబోతుంది? అనే విషయాలు చెప్పబోతున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ, అందులోని పాత్రలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన వివరాలను సంక్షిప్తంగా చెబుతారట రాజమౌళి.
ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ను కూడా షురూ చేసినట్లు టాక్. త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి వీడియోని రిలీజ్ చేస్తారా? లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ చూసుకుని వివరాలు చెప్తారా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.
Official Clarification on Casting Rumors for SS Rajamouli & Mahesh Babu's Upcoming Film. pic.twitter.com/LKKFCMJ40p
— Vamsi Kaka (@vamsikaka) May 17, 2024