ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని మహిళా ఎంపీపీ ఆగ్రహం

ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని మహిళా ఎంపీపీ ఆగ్రహం
  • మంత్రి ఎర్రబెల్లి సమక్షంలోనే నిలదీసిన మహిళా ఎంపీపీ తడుక రాణి
  • కేసీఆర్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధులకు ఇదేనా న్యాయం అని ప్రశ్నించిన మహిళా ఎంపీపీ

వరంగల్ అర్బన్: కమలాపూర్ లోని సబ్ మార్కెట్ యార్డులో జరిగిన మహిళా సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బాల్క సుమన్ సమక్షంలో ఎంపీపీ తడుక రాణి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండ అవమానించారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీపీ తడక రాణి మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేల సమక్షంలోనే బాహాటంగా  ప్రశ్నించడం మొదలుపెట్టడంతో సభలో కలకలం చెలరేగింది. దీంతో టీఆర్ఎస్ నేతలు, పోలీసులు ఆమె వద్దకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 
హుజూరాబాద్ -పరకాల రహదారిపై బైఠాయించి ఆందోళన

మహిళా ఎంపీపీనైన తనను చులకనగా చూస్తూ.. కనీసం ప్రొటోకాల్ పాటించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కమాలపూర్ ఎంపీపీ తడుక రాణి రోడ్డుపై నిరసనకు యత్నించింది. సభలో మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే బహిరంగంగా నిలదీయడంతో సర్దుబాటు చేయాల్సిందిపోయి.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని 
అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీ నైనా తనపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్కక్తం చేసింది. వారేం చేసినా జీ హుజూర్ అనాలని.. లేకపోతే పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది. 
పార్టీ మారాలని కోరితే తాను వినడం లేదని.. పలువురు టిఆర్ఎస్ నాయకులు వారి తొత్తులచే అసభ్య పదజాలంతో పోస్టింగులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చచెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వారితో మాట్లాడుతూ.. మహిళా ఎంపీపీ నైన తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని, పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  కేసీఆర్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధులకు న్యాయం ఇదేనా అంటూ ఎంపీపీ తడుక రాణి ఈ సందర్భంగా ప్రశ్నించింది.