అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు

అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణాలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రూ.701.11 కోట్లు ఖర్చయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి తెలిపారు.ఈ లెక్కలు ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు వివరాలను ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా జిల్లా కలెక్టర్లను అడిగితే సమాచారం ఇవ్వలేదన్నారు. 

ఎన్నికల ఖర్చుకు ఆడిట్ లేనందున అభ్యర్థులు దుబారాగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. వీటిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఖర్చుపై అడ్వకేట్ జనరల్ (ఏజీ)తో విచారణ జరిపించాలని కోరుతూ ఈసీ సీఈవోకు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఎన్నికల ఖర్చు వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆయన లేఖలో డిమాండ్  చేశారు.