
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న
జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న అన్నారు. జనగామలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ
పల్లాను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆ పదవి కి రాజీనామా చేసి మంత్రి కావాలన్న ఆశతో ఎమ్మెల్యేగా పోటీ చేశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. కొమరవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ వంటి దేవుళ్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఓట్లు అడిగిన బీఆర్‌ఎస్ లీడర్లను ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో అడగాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కార్యక్రమంలో వంగాల మల్లారెడ్డి, ఆలేటి సిద్దిరాములు, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, పిట్టల సతీశ్, బొట్ల శ్రీనివాస్, చిలువేరు అబిగౌడ్, దాసరి క్రాంతి పాల్గొన్నారు.