న్యూ ఇయర్ కి డ్రగ్స్ పార్టీ ప్లాన్ చేసిన బీటెక్ స్టూడెంట్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్...

న్యూ ఇయర్ కి డ్రగ్స్ పార్టీ ప్లాన్ చేసిన బీటెక్ స్టూడెంట్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్...

న్యూ ఇయర్ కి టైం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు.ఈవెంట్స్ కి టికెట్ బుక్ చేసుకునేవారు కొందరైతే.. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ ప్లాన్  చేసుకునేవారు మరికొంతమంది. న్యూ ఇయర్ పార్టీ అన్నాక ముక్క, చుక్క లేకుండా ఉంటుందా చెప్పండి. ముక్క, చుక్క వరకు ఒకే కానీ.. ఇంకొంతమంది న్యూ ఇయర్ ని వీలైనంత ఎంజాయ్ చేయాలని డ్రగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలా న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్ తీసుకొస్తున్న ఓ  బీటెక్ స్టూడెంట్ ని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్ధి బెంగళూరు నుండి హైదరాబాద్ కు ట్రావెల్స్ బస్సులో MDMA డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్నామని తెలిపారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.నిందితుడి దగ్గర నుంచి 6 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.సిగరెట్ బాక్సులో 6 గ్రాముల ఎండిఎంఏ ;డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ పార్టీ చేసుకోవాలని భావించామని..  ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ తీసుకొచ్చామని చెబుతున్నాడు నిందితుడు. ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు RGAI పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.అనంతరం నిందితుడిని  RGIA పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.