వైరల్ వీడియో: స్టేజ్ పర్ఫామెన్స్లో డ్యాన్సర్స్కు బదులు రోబోలు.. బ్యాగీ ప్యాంట్లో ఎలా ఇరగదీశాయో చూడండి !

వైరల్ వీడియో: స్టేజ్ పర్ఫామెన్స్లో డ్యాన్సర్స్కు బదులు రోబోలు.. బ్యాగీ ప్యాంట్లో ఎలా ఇరగదీశాయో చూడండి !

ఇందు గలడందు లేడని వలదు.. అన్నట్లు ఎక్కడ చూసినా, ఏ రంగంలోకి అయినా రోబోలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దాదాపు అన్ని రంగాల్లో ఏఐ చేస్తున్న వింతలకు మనిషికి పని ఉండదేమో అనేలా ఆందోళనలు మొదలయ్యాయి. వినోద రంగంలో కూడా అంటే మ్యూజిక్, గ్రాఫిక్స్, ఎడిటింగ్ తదితర అంశాలలో AI లెక్కలేనన్ని మార్పులు తీసుకొచ్చింది. లేటెస్టుగా ఈవెంట్ స్టేజ్ పర్ఫామెన్స్ లో రోబోలు ఎంట్రీ ఇవ్వడంతో ఇక డ్యాన్సర్ల పరిస్థితి ఏంటా..? అనే సందేహాలు మొదలవ్వక మానదు.

చైనాలో ఒక ఈవెంట్లో రోబోలు డ్యాన్స్ ఇరగదీశాయి. డ్యాన్సర్లతో కలిసి చాలా రిథమిక్ గా, స్టైలిష్ గా చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. చైనీస్-అమెరికన్ సింగర్ వాంగ్ లీహమ్ ఫ్యూచరిస్టిక్ డ్యాన్స్ అయిన బెస్ట్ ప్లేస్ టూర్ అనే కన్సర్ట్ లో రోబోలు అలరించాయి. చైనాలోని చెంగ్డూలో జరిగిన ఈ ఈవెంట్ లో బ్యాగీ ప్యాంట్స్ తో డ్రెసప్ అయిన రోబోలు.. డ్యాన్స్రర్స్ తో సరిసమానంగా వేసిన స్టెప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 

ఓపెన్ ఫైర్.. అనే సాంగ్ పర్ఫామెన్స్ లో స్టేజీపైన రోబోలు డ్యాన్స్ తో అదరగొట్టాయి. లైటింగ్, టైమింగ్ కు తగ్గట్లుగా డ్యాన్స్  చేస్తున్న విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే.. రోబోల ఫ్రంట్ ఫ్లిప్స్. వెబ్ స్టర్ ఫ్లిప్స్ గా పలిచే జంపింగ్ లో చాలా పర్ఫెక్ట్ గా దూకేశాయి. ఎగిరి తల కిందికి చేస్తూ ఒక రౌండ్ పూర్తి చేసి దూకడం ఇటీవల యూత్ చేస్తున్న స్టంట్స్ చూస్తున్నాం. అదే స్టైల్ లో రోబోలు దూకడం స్పెషల్ అట్రాక్షన్. 

ఈ కన్సర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్.. రెండూ కలిసి కళాత్మక ప్రదర్శనలో కూడా వింతలు సృష్టించగలవని చెప్పడమేనని ఈవెంట్ మేనేజర్స్ చెప్పారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో రోబోలు కళాకారులను రీప్లేస్ చేయగలవని ఈ షో ద్వారా ప్రకటించారు. షోస్, పర్ఫామెన్స్, కన్సర్ట్స్ లలో రోబోటిక్ డ్యాన్సర్స్ వస్తున్నారంటూ.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించవచ్చు. 

విభిన్న అభిప్రాయాలు:

వాంగ్ లీహమ్ కొరియోగ్రఫీలో రోబోటిక్ డ్యాన్సర్స్ చేసిన వింతలకు ప్రపంచం ఫిదా అయ్యిందనే చెప్పాలి. దానికి సంబంధించిన వీడియో X, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. వివిధ ప్లాట్ ఫామ్స్ లో ఫ్యా్న్స్ వీడియోను షేర్ చేస్తుండటంతో మోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చైనా రోబోటిక్స్, అమెరికాకు సంబంధించిన టెస్లా ప్రాజెక్టులను పోల్చుతూ షేర్ చేస్తున్నారు. 

AI తో డ్యాన్సర్స్ రీప్లేస్ అయ్యారని.. ఆ స్టె్ప్స్ చూస్తుంటే ఇక డ్యాన్సర్స్ అవసరం ఉండదేమో.. అంటూ యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చదివిన సైన్స్ ఫిక్షన్స్ బుక్స్ సంబంధించిన స్టోరీలు ఫ్యూచర్ లో నిజం అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. 2026లో రోబోల వినియోగం మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మనిషి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో మన మూడ్ ను మార్చగలడు. కానీ ఫేస్ లేని.. రోబోటిక్స్ ద్వారా చేసే పర్ఫామెన్స్ ఎప్పటికైనా జిమ్నాస్టిక్స్ చేసినట్లే ఉంటుందని పెదవి విరుస్తున్నారు.