ఆపిల్ సరికొత్త ప్లాన్! శామ్సంగ్ కు పోటీగా ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోంది.. డిజైన్ లీక్!

ఆపిల్ సరికొత్త ప్లాన్! శామ్సంగ్ కు పోటీగా ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోంది.. డిజైన్ లీక్!

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. గతంలో ఆపిల్ ఒక పెద్ద బుక్ లాంటి తెరుచుకునే ఐఫోన్‌ను తయారు చేస్తుందని వార్తలు వచ్చాయి, కానీ తాజా సమాచారం ప్రకారం కంపెనీ 'క్లామ్‌షెల్' (Clamshell) మోడల్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 ఈ ఫోన్ చూడటానికి Samsung Galaxy Z Flip లేదా Motorola Razr లాగా ఉంటుంది. అంటే ఈ ఫోన్‌ను  మడిచిజేబులో పెట్టుకోవచ్చు.  ఆపిల్ ల్యాబ్‌లలో ఈ రకమైన ప్రోటోటైప్‌లను ఇప్పటికే పరీక్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఇంటర్నెట్‌లో చాలామంది 'iPhone Flip' అని పిలుస్తున్నారు.

ఎప్పుడు రావచ్చు?: ఈ ఫోన్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ లైనప్‌లో ఇది అత్యంత ఖరీదైన,  హై-ఎండ్ ఫోన్‌గా ఉండబోతోంది. అయితే దీనితో పాటు  ఆపిల్ ఒక పెద్ద ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను కూడా తయారు చేయాలనుకుంది. కానీ ఈ ప్రాజెక్టులో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో, ప్రస్తుతం కంపెనీ మొత్తం దృష్టి ఫోల్డబుల్ ఐఫోన్‌లపైనే పెట్టినట్లు సమాచారం.

సాధారణ ఐఫోన్‌లలాగే ఫోల్డబుల్ ఫోన్‌లలో కూడా వినియోగదారులు వేర్వేరు ఆకారాలు, పరిమాణాలు కోరుకుంటారని ఆపిల్ భావిస్తోంది. అందుకే మార్కెట్లోకి వచ్చేటప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త డిజైన్లతో రావాలని ప్లాన్ చేస్తోంది.