కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత ఆపిల్ ఐఫోన్, శామ్‌సంగ్ మరియు ఇతర స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా లేదా ఖరీదైనవిగా మారతాయా? ప్రభుత్వం కోతలను ప్రకటించింది… కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత ఐఫోన్, శామ్‌సంగ్ వంటి స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దింతో రాబోయే నెలల్లో అన్ని బ్రాండ్‌ల నుండి పాపులర్ ఫోన్‌ల ధరలు ఎంత వరకు తగ్గుతాయో ఇప్పుడు స్పష్టత వస్తోంది.......
2026 కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్‌లను తయారు చేయడానికి ఉపయోగించే విడి భాగాలపై కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం తగ్గిస్తూన్నట్లు ప్రకటించింది. వీటిలో బ్యాటరీలు, తయారీ ప్లాంట్లలో ఉపయోగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. తక్కువ సుంకాలు అంటే భారతదేశంలో తయారైన ఫోన్‌లకు తక్కువ ఉత్పత్తి ఖర్చు అవుతుంది.
విదేశాల్లో ఫోన్లు కొనే వారికి మరో పెద్ద రిలీఫ్ లభించింది. ఇండియాకి తీసుకోచ్చే సుంకం విధించే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించారు. దీనివల్ల అంతర్జాతీయ ప్రయాణికులకు హై-ఎండ్ ఐఫోన్లు, శామ్‌సంగ్ గెలాక్సీ తో సహా దిగుమతి చేసుకున్న ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుతాయి.
పన్ను కోతలు ఉన్న కూడా కొనేవారికి ఎంత ప్రయోజనం చేరుతుందనే దానిపై... ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల వల్ల ఆ ప్రయోజనం సామాన్యులకు పూర్తిగా అందకపోవచ్చు.
AI డేటా సెంటర్ల నుండి హై డిమాండ్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు AI-పై దృష్టి సారించాయి, అంటే ఖరీదైన ప్రాసెసర్‌లు, పెద్ద RAM అవసరాలు పెరుగుతాయి. దీని కారణంగా ఫోన్ తయారీదారులు ధరలను వెంటనే తగ్గించడానికి బదులుగా పెరుగుతున్న భాగాల ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికి పన్ను ఆదాను ఉపయోగించుకోవచ్చు.
మొత్తం మీద, 2026లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా కాకపోయినా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో తయారు చేసిన మోడళ్లు. అయితే, ఏదైనా ధర తగ్గింపు రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంది. అయితే కంపెనీలు నేరుగా ధర తగ్గించడం కంటే, పండుగ ఆఫర్లు లేదా సేల్స్ సమయంలో ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
