కూకట్ పల్లి GHMC ఆఫీసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ SE చిన్నారెడ్డి 

కూకట్ పల్లి GHMC ఆఫీసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ SE చిన్నారెడ్డి 

కూకట్ పల్లి GHMC జోనల్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. బుధవారం ( ఫిబ్రవరి 4 ) జరిగిన ఈ తనిఖీల్లో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు SE చిన్నారెడ్డి. టెండర్ విషయంలో చిన్నారెడ్డి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇవాళ కూకట్ పల్లి GHMC జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహించి చిన్నారెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇదే ఆఫీసులో మ్యూటేషన్ విషయంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ కూడా పట్టుబడ్డట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

►ALSO READ | మేడారంలో తిరుగువారం పండుగకు వెళ్తుండగా బోలెరో వాహనం బోల్తా...15 మందికి గాయాలు

ఇదిలా ఉండగా.. బండ్లగూడ జోన్ పరిధిలో జరిపిన సోదాల్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం డిమాండ్ చేసిన ఎవరినైనా వదలమని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.