తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 02.
ఖాళీలు: 34. అన్రిజర్వ్డ్ 11, ఈడబ్ల్యూఎస్ 04, పీడబ్ల్యూబీడీ 01, ఎక్స్ సర్వీస్మన్ 01, స్పోర్ట్స్ పర్సన్ 02, బీసీ–ఏ 03, బీసీ–బీ 02, బీసీ–డీ 02, బీసీ–ఈ 02, ఎస్సీ 04, ఎస్టీ 02.
ఎలిజిబిలిటీ:
- అభ్యర్థి 7వ తరగతి నుంచి10వ తరగతి మధ్య ఏదైనా పరీక్షలో లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు అర్హులు కారు.
- న్యాయాధికారుల నివాసాల్లో చేయాల్సిన విధులకు సంబంధించిన అంటే వంట, వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ మొదలైన ఏదైనా పని అనుభవాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి.
- వయోపరిమితి: 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 07.
- అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఫీజు రిఫండ్ చేస్తారు.
- లాస్ట్ డేట్: మార్చి 02.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు https://tshc.gov.in
- వెబసైట్ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
- ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 45 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌పై 45 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 60 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
- కనీస అర్హత మార్కులు: ఓసీ, ఈడబ్ల్యూఎస్ 45 శాతం, బీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్, మౌఖిక ఇంటర్వ్యూ కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను అనుసరించి 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- జ్యుడీషియల్/ లీగల్ సర్వీసుల్లో కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న అభ్యర్థులకు కనీసం రెండేండ్ల సర్వీస్, కనీస అర్హత మార్కులను పొందిన తర్వాత సర్వీస్ ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఇస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ (వైవా– వోస్) ఐదు మార్కులకు ఉంటుంది.
