Eesha Warning: భయపెట్టే చీకటి ప్రపంచంతో ‘ఈషా వార్నింగ్‌’ వీడియో

Eesha Warning: భయపెట్టే చీకటి ప్రపంచంతో ‘ఈషా వార్నింగ్‌’ వీడియో

అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’ (Eesha). హెబ్బా పటేల్ హీరోయిన్‌‌‌‌గా నటించింది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ని కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆసక్తి రేపాయి. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు.

‘ఈషా వార్నింగ్‌’ పేరుతో రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. హార్రర్ థ్రిల్లర్లో జానర్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది కొత్తగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆత్మలు, మూఢ నమ్మకాలపై సాగిన సీన్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.

‘మీరు ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’. ‘‘మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టకతోనే శాపగ్రస్తమవుతాయి. తర్వాత క్రమంగా అవి ఆత్మలకు నిలయంగా మారుతాయి. నీదైన శరీరాన్ని.. నీదికాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?’’ అనే డైలాగ్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. చివర్లో ఆత్మ అంటే అదేనేమో అనే సస్పెన్స్ క్రియేట్ చేసే డైలాగులు భయపెట్టేలా ఉన్నాయి. దానికి తోడు విజువల్స్, సౌండింగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

ఈ ట్రైలర్ బట్టి చూస్తే.. ఆడియన్స్ ఒక రియలిస్టిక్ ఫీల్‌‌‌‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారని క్లారిటీ మాత్రం ఇచ్చేస్తుంది. రాజు వెడ్స్ రాంబాయితో మంచి సాలిడ్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోనున్నాడో చూడాలి.