నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20) హైదరాబాద్‎లోని -నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ మూడు కేసుల్లో ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. 

ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారనే ఫిర్యాదుపై 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే.. తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా వివిధ కారణాలతో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. 

ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‎పై ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా శనివారం (డిసెంబర్ 20) ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.