స్లాబ్ కింద వాటర్ సంపు ఉండొచ్చా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.. ?

స్లాబ్ కింద వాటర్ సంపు ఉండొచ్చా.. ? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.. ?

స్లాబ్ కింద వాటర్ సంపు..

కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ కిందనే వాటర్సంపు వస్తుంది. అలా ఉండొచ్చా? దాని వల్ల ఇబ్బందులు ఏమైనా వస్తాయా? 

స్లాబ్ కింద వాటర్ సంపు ఉండొచ్చు. కానీ ఇంటి సింహద్వారానికి ముందు మాత్రం ఉండకూడదు. భూమి లోపల ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం వైపు వాటర్సంపు ఏర్పాటుచేసుకోవచ్చు. నీళ్లతో నిండి ఉండే వాటర్ సంపుపై నడవడం అంత మంచిదికాదు. ఒకవేళ నడవాల్సి వస్తే, దాని పక్కనుంచి నడవాలి.

ఆస్థలం కొందామని..

ఒక స్థలం కొనాలనుకుంటున్నా. దానికి దక్షిణ, పడమర వైపు రోడ్డు ఉంది. ఆ స్థలాన్ని కొనొచ్చా? 

ఆస్థలం మంచిదే. కొనుక్కోవచ్చు. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా ఆ స్థలం బాగా కలిసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా దూరమవుతాయి. వేరే ప్రాపర్టీ కొనే యోగ్యం కూడా దక్కుతుంది. మరో ఆలోచన చేయకుండా, ఆ స్థలాన్ని వెంటనే కొనండి.

టాయిలెట్ ఉండొచ్చా?

మాది డూప్లెక్స్ హౌస్, పడమర వైపు దిక్కులో మెట్ల కింద టాయిలెట్ కట్టాం. అలా ఉండొచ్చా?

మెట్ల కింద టాయిలెట్ ఉండకూడదు. దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆర్థిక, అనారోగ్య సమస్యలు వస్తాయి. వెంటనే మార్పులు చేసుకోవాలి. టాయిలెట్ ప్లేసులో స్టోర్ రూం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆగ్నేయం లేదా వాయువ్యంలో మాత్రమే టాయిలెట్ ఉండాలి. నైరుతి, ఈశాన్యంలో అసలు ఉండకూడదు.

కాశీనాథుని శ్రీనివాస్ 

వాస్తు కన్సల్టెంట్: 94400 88799