మీరు ఏంటో.. మీ విధానాలేంటో..! రింకూ సింగ్‎ను వరల్డ్ కప్‎కు సెలెక్ట్ చేయడంతో బీసీసీఐపై విమర్శలు

మీరు ఏంటో.. మీ విధానాలేంటో..! రింకూ సింగ్‎ను వరల్డ్ కప్‎కు సెలెక్ట్ చేయడంతో బీసీసీఐపై విమర్శలు

న్యూఢిల్లీ: 2026లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్వ్కాడ్‎ను శనివారం (డిసెంబర్ 20) అనౌన్స్ చేసింది. ఫామ్‎లో లేనప్పటికీ సూర్య కుమార్ యాదవ్‎పై నమ్మకం ఉంచిన బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలను అతడికే అప్పగించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‎ను వైస్ కెప్టెన్‎గా నియమించింది. ఫామ్‎లేమితో సతమతమవుతోన్న టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్‎పై వేటు వేసింది. 

ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. టీ20 వరల్డ్ కప్ కోసం యంగ్ బ్యాటర్ రింకూ సింగ్‎ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. రింకూ సింగ్‎ను టీ20 వరల్డ్ కప్‎కు ఎంపిక చేయడంపై ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ అతడు టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రణాళికలో ఉంటే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‎కు ఎందుకు పక్కనా బెట్టారనేదే ప్రశ్న. టీ20 వరల్డ్ కప్‎కు రింకూను పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు అతడిని సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఆడించాల్సిందని క్రీడా విశ్లేషకులు, సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ అంతా బాగుంది.. ఆ ఒక్కడికే అన్యాయం: వరల్డ్ కప్ స్క్వాడ్‌లో టీమిండియా ఓపెనర్ కు మరోసారి నిరాశ

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిస్తే వరల్డ్ కప్‎కు ముందు అతడికి తగినంత ప్రాక్టీస్ లభించేదంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై సెటైర్లు వేయడంతో పాటు విమర్శలు  చేస్తున్నారు. అసలు మీరు ఏంటో.. మీ విధానాలేంటో అంటూ బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‎గా వచ్చిన్నప్పటీ నుంచి జట్టులో అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా