అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే.. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపిస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారని..ఇప్పుడేం చేస్తారంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. శనివారం ( డిసెంబర్ 20 ) తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటనలో భాగంగా అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్.

వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. వైసీపీ ఆకు రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇస్తేనే తిక్క కుదురుతుందని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన వామపక్ష తీవ్రవాదమే  కకావికలమైందని.. రెండు రోజులు కిరాయి గుండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రౌడీలపై రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి మాటలు రావని అన్నారు పవన్ కళ్యాణ్.

వైసీపీ రౌడీలు దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకున్నందుకు ఎంతో మందితో తిట్లు తిన్నానని.. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జతకట్టామని..ఇప్పుడు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు పవన్ కళ్యాణ్.