రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ లాభాల బాటలో అడుగుపెట్టింది. డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మోగ్లీ’ ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకుంది.
థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వసూళ్లన్నీ కలుపుకొని దాదాపు రూ.10 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోగ్లీ.. బ్రేక్‌ఈవెన్‌ను దాటి లాభాల బాటలోకి అడుగుపెట్టింది. రెండో వారం కూడా ఇదే దూకుడు కొనసాగితే.. వైల్డ్ బ్లాక్‌బస్టర్గా మోగ్లీ బాక్సాఫీస్ వద్ద జెండా పాతడం కన్ఫామ్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, మోగ్లీ మూవీకి పోటీగా పెద్ద సినిమాలు ఉండటం వసూళ్ల దూకుడుకి అడ్డుకట్టగా మారింది. ఓ వైపు బాలకృష్ణ అఖండ 2, మరోవైపు రణవీర్ సింగ్ 'ధురంధర్' వంటి బడా సినిమాల మధ్య కూడా.. టఫ్ ఫైట్ ఎదుర్కొని ఫస్ట్ వీకెండ్ స్థిరంగా నిలబడింది. ఇప్పుడు ఈ రెండో వారం అవతార్ 3 కూడా తోడవ్వడంతో కలెక్షన్స్ కాస్తా నెమ్మగించాయి. అయినప్పటికీ.. మోగ్లీ తన సత్తా చాటుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ మూడు చిత్రాలను దాటుకుని మోగ్లీ ఎలాంటి ఫైనల్ రన్ వద్ద ముగుస్తుందో చూడాలి!!
The entire forest takes part in #Mowgli's War ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) December 20, 2025
Wild Blockbuster #Mowgli2025 Running Successfully in 2nd Week 💥
🎟️ https://t.co/HHe863GdbE
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical 🎵
🌟ing @RoshanKanakala, @SakkshiM09 & @publicstar_bsk@vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/BdbtHh1Wkt
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా ‘మోగ్లీ’ తెరకెక్కింది. రామాయణం, కర్మ సిద్ధాంతానికి ముడిపెడుతూ తెరకెక్కించిన విధానం ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. ఈ క్రమంలో సినిమాకు ఫస్ట్ డే నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కంటెంట్‌కి ప్రాధాన్యత ఉండటంతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయం సాధించగలదని ‘మోగ్లీ’ మరోసారి నిరూపించింది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలుకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మోగ్లీ ఇండస్ట్రీకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాకుండా IMDB నుంచి మోగ్లీ సినిమాకు పదికి 8.3 రేటింగ్ కూడా రావడం విశేషం.
ఇదిలా ఉంటే.. హీరో రోషన్ కనకాల యాక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. తన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. హీరోగా రోషన్కి ఇది తొలి ఘన విజయం. విలన్ పాత్రలో చేసిన బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరితోపాటు వైవా హర్ష, కృష్ణ భగవాన్ కీలక పాత్రలు పోషించారు. హీరో సుహాస్, రియా సుమన్ గెస్ట్ రోల్స్‌లో ఆకట్టుకున్నారు.
కథేంటంటే:
పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతం. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాడు మోగ్లీ ఉరఫ్ మురళి (రోషన్ కనకాల). అతను ఒక అనాథ. అడవినే తల్లిగా భావించే మోగ్లీ ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు.
అలా జీవనం సాగించుట కొరకు బెస్ట్ ఫ్రెండ్ అయిన బంటి (వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి వెళుతుంటాడు. అక్కడ జూనియర్ ఆర్టిస్టులను చేరవేయడం అతని పని. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్లో భాగంగా డూప్‌గా నటించాల్సి వస్తుంది మోగ్లీ. ఇక అదే సినిమా టీమ్‌లోని సైడ్ డ్యాన్సర్ జాస్మిత్ (సాక్షి మడోల్కర్)తో లవ్లో పడతాడు.
అయితే, ఆమెకు చెవులు వినపడవు. మాటలు రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. అలా సీతరాముల్లాంటి ఈ జంట మధ్యలోకి రావణుడిలా ఎంట్రీ ఇస్తాడు SI క్రిప్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్). నోలన్ రాకతో జాస్మిత్ లైఫ్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో నోలన్, హీరోయిన్ జాస్మిత్‌పై మోజు పడతాడు. ఎలాగైనా ఆమెను వాడుకోవాలని ఎన్నో పథకాలు వేస్తాడు. ఇలా జాస్మిత్-మోగ్లీ జంటని ఎన్నో చిత్రహింసలు పెడతాడు.
ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి.. ప్రియురాలు జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి జాస్మిత్-మోగ్లీ ప్రేమ గెలిచిందా లేదా? అడవిని నమ్ముకుని బ్రతికే మోగ్లీకి.. ఆ దైవం ఎలాంటి ధైర్యం ఇచ్చింది? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే
