ట్రాఫిక్ చలాన్ల ఆఫర్ కు.... వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సర్కార్ ఖజానాకు వందల కోట్లు వచ్చి చేరుతున్నాయి. ఏకంగా 20 రోజుల్లోనే 120 కోట్లు వసూల్ అయ్యాయి. మార్చి 1 నుంచి 20 వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కోటి 20 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీంతో సర్కార్ ఖజానాకు జంట నగరాల నుంచి 112 కోట్ల 98 లక్షలు చేరాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 63 లక్షల చలాన్ లు క్లియర్ కాగా...49 కోట్ల 6 లక్షల ఫైన్లు వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్ లో 38 లక్షల చలాన్లు క్లియర్ కాగా 45 కోట్ల 8 లక్షలు సర్కార్ ఖజానాకు చేరాయి. రాచకొండలో 16 లక్షల చలాన్లు క్లియర్ చేయగా...15 కోట్ల 3 లక్షల ఫైన్లు చెల్లించారు వాహనదారులు... దీంతో 20 రోజుల్లో దాదాపు 120 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి.
ఇవి కూడా చదవండి:
