తన తండ్రికి కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని ఓ బాలుడు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తన కాలేయాన్ని దానం చేయడానికి అనుమతించాలంటూ కోరుతూ ఆ బాలుడు కోర్టులో విన్నవించుకున్నాడు. అనంతరం పిటీషన్ ను స్వీకరించి, వాదనలను విన్న సుప్రీంకోర్టు... 17 ఏళ్ల బాలుడు కాలేయాన్ని ఎలా దానం చేయగలడంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసింది. అంతే కాకుండా తదుపరి విచారణలో ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారి సుప్రీంకోర్టు ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు మైనర్ అవయవ దానం ఇవ్వవచ్చో, లేదా అన్న విషయంపై ప్రాథమిక పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
