కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా : రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా : రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మైనారిటీ, మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా.. ఆమె ఆ రాజీనామాను ఆమోదించారు. ప్రధాన మంత్రి మోదీ సూచన మేరకు జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. మోదీ వల్లనే కేంద్ర మంత్రిని అయ్యాయనని.. ఆయన ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ రాజీనామా తర్వాత వ్యాఖ్యానించారు జార్జ్ కురియన్.

మైనారిటీ సంక్షేమం, మత్స్య శాఖ కేంద్ర సహాయ మంత్రిగా ఇన్నాళ్లు బాధ్యతలు నిర్వహించిన జార్జ్ కురియన్ రాజీనామా కారణం లేకపోలేదు. ఆయన రాజ్యసభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలనే అతని రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. బీజేపీ పార్టీ అతనికి మళ్లీ రాజ్యసభకు పంపించలేదు. ఈ క్రమంలోనే జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

ALSO READ : నటుడు ప్రకాష్ రాజ్‌కు నాన్-బైలబుల్ వారెంట్

ప్రధాని మోదీ సూచనతోనే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

కేరళ రాష్ట్రానికి చెందిన జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీకాలం జూన్ 21న ముగిసింది. బీజేపీ పార్టీ తిరిగి ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేశారు. 
జార్జ్ కురియన్ 2024 జూన్ 9న కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రిగా ఉండగానే.. మొన్న జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో.. కంజిరపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోవటం.. కేరళ రాష్ట్రంలో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఒకటి అయితే.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఆయన్ను ఎంపిక చేయలేదు.