ప్రకాష్ రాజ్‌కు నాన్-బైలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

ప్రకాష్ రాజ్‌కు నాన్-బైలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

తన విలక్షణ నటనతో  ప్రేక్షకులను అలరిస్తున్న వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్..  ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక సెన్సేషనల్ లీగల్ చిక్కుల్లో పడ్డారు. సామాన్యులకు తాము ఉన్న ఊరిలోనే  ఓట్లు గల్లంతవుతుంటే..  ఇక్కడ మాత్రం ప్రకాష్ రాజ్ కు  ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే షాకింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు ఆయనకు నాన్-బైలబుల్ వారెంట్ (NBD) జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగిందంటే..?
ఈ కథ 2019లో మొదలైంది. అడ్వకేట్ దిలీప్ కుమార్ బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్‌కు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... ఇలా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయని, ఇది భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముమ్మాటికీ నేరమని ఆయన కోర్టుకెక్కారు. మన దేశ చట్టాల ప్రకారం ఒక పౌరుడికి ఒకే ఒక్క ఓటు హక్కు ఉండాలి.  కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వర్సటైల్ యాక్టర్ అనే ట్యాగ్‌ను ఓటర్ ఐడీల్లోనూ వాడేసారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

కోర్టు సీరియస్.. ఇక అరెస్ట్ తప్పదా?

పోలీసులు, ఎలక్షన్ కమిషన్ ఈ ఫిర్యాదుపై స్పందించకపోవడంతో అడ్వకేట్ దిలీప్ కుమార్ 48వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ప్రకాష్ రాజ్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన మాత్రం కోర్టుకు హాజరు కాకుండా లైట్ తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం లేటెస్ట్ గా నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసింది. అంటే, పోలీసులు ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ లీగర్ గా ఎలాంది నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ALSO READ : సమంత త్వరలోనే తల్లి కాబోతుందంటూ మెగాస్టార్ క్రేజీ ట్వీట్

వివాదాలు

1994లో 'డ్యూయెట్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన ప్రొడక్షన్ కంపెనీకి కూడా అదే పేరు పెట్టుకున్న ప్రకాష్ రాజ్.. నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. అయితే, ఆయన కేవలం వెండితెరపైనే కాదు, నిత్యం సమాజంపై, రాజకీయాలపై తన బోల్డ్ కామెంట్స్ తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటారు. మరి ఈ ఓటర్ ఐడీల వివాదంపై ప్రకాష్ రాజ్ తన స్టైల్‌లో... అంతా మాయాజాలం అంటారో, లేక చట్టపరంగా ఫైట్ చేస్తారో చూడాలి.