స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీ5లో భారత్ భాగ్య విధాత స్ట్రీమింగ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీ5లో  భారత్ భాగ్య విధాత స్ట్రీమింగ్

కంగనా రనౌత్‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌లో  రూపొందిన  చిత్రం ‘భారత్‌‌‌‌ భాగ్య విధాత’.  మనోజ్ తపాడియా దర్శకత్వం వహించగా,  కంగనకు చెందిన మణికర్ణిక ఫిల్మ్స్‌‌‌‌తో కలిసి పెన్ స్టూడియోస్,  పరమహంస క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. జూన్‌‌‌‌లో థియేటర్స్‌‌‌‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఆగస్టు 14న ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌‌‌‌గా హిందీ జీ5లో ఈ చిత్రం  స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

దేశం కోసం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన అజ్ఞాత వీరుల కథను    ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో జీ5 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌‌‌‌కు ప్రకటించామని అన్నారు.   26/11 ముంబై టెర్రర్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన నర్సులు, వార్డ్ బాయ్స్, క్లీనర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది లాంటి అన్‌‌‌‌సంగ్‌‌‌‌ హీరోస్‌‌‌‌కు నివాళిగా ఈ సినిమా ఉంటుంది.   గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌‌‌‌దేవ్, ఈషా డే, ప్రియా బెర్డే, ఆశా షేలార్ ఇతర పాత్రలు పోషించారు.