అగధతో గుర్తింపు వస్తుందని భావిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

అగధతో గుర్తింపు వస్తుందని భావిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డర్టీహరి, మంగళవారం చిత్రాల తర్వాత శ్రవణ్ రెడ్డి నటించిన చిత్రం ‘అగధ’.  నిర్మాతగా పలు సూపర్ హిట్స్ నిర్మించిన ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఆగస్టు 14న సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా నటుడు శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక డివైన్ మిస్టికల్ థ్రిల్లర్.  నా పాత్ర చాలా డిఫరెంట్‌‌‌‌గా  ఉంటుంది.  ఎంతో ఛాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది.  ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు.

పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా సాగుతుంది. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద  నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. ఎంఎస్ రాజు లాంటి సీనియర్‌‌‌‌‌‌‌‌ నా కోసం పాత్ర రాయడం సంతోషంగా ఉంది.  ఆయనకి సినిమా పట్ల ఉండే తాపత్రయం, డెడికేషన్‌‌‌‌ను నేను మ్యాచ్ చేయలేను. ఈ చిత్రాన్ని దాదాపు నేచురల్ లొకేషన్స్‌‌‌‌లోనే షూట్ చేశాం.  కొన్ని మాత్రం  మిస్టిక్, హారర్ ఫీల్‌‌‌‌  ఇవ్వడానికి సెట్స్ వేయాల్సి వచ్చింది. ఇందులో వీఎఫ్‌‌‌‌ఎక్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.  కామాక్షి భాస్కర్ల,  ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌‌‌‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌‌‌‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి పాత్రలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రానికి పార్ట్‌‌‌‌2 కూడా ఉండే చాన్స్ ఉంది’ అని చెప్పాడు.