పేరెంట్స్ వేడుకున్నా లొంగిపోని టెర్రరిస్టులు

పేరెంట్స్ వేడుకున్నా లొంగిపోని టెర్రరిస్టులు

సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో ఇద్దరు మిలిటెంట్లు హతం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులకు సెక్యూరిటీ ఫోర్సెస్ కు మధ్య శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు మిలిటెంట్లను మట్టుపెట్టాయి. ముందుగా ఆయా మిలిటెంట్ల పేరెంట్స్ ను ఎన్ కౌంటర్ జరిగిన వాంపొరా ప్రాంతానికి తీసుకెళ్లారు. టెర్రరిస్టులకు లొంగిపోవాల్సిందిగా అవకాశం ఇచ్చారు. కానీ సరెండర్ అవ్వాల్సిందిగా భద్రతా దళాలు చేసిన విజ్ఞప్తిని వారు తోసిపుచ్చారు. చనిపోయిన టెర్రరిస్టులను లష్కర్ ఏ తొయిబా గ్రూప్ నకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. కానీ, వారు హిజ్బుల్ ముజాహిదీన్ మెంబర్స్ అని అధికారులు చెప్పారు. సోమవారం కుల్గాంలోని దమ్హల్ హంజీపొరా ప్రాంతంలో ఓ టెర్రరిస్ట్ ను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కశ్మీర్ లో చాలా మంది టెర్రరిస్టులను భద్రతా దళాలు తుదముట్టించాయి. వారిలో హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన కమాండర్ రియాజ్ నైకూ ఒకడు. ఆ గ్రూప్ నకు నైకూ డీ–ఫ్యాక్టో చీఫ్ గా వ్యవహరించేవాడు. నైకూ తలపై రూ.12 లక్షల రివార్డు ఉండేది. మే మొదట్లో అతణ్ని సెక్యూరిటీ ఫోర్సెస్ చంపిన సంగతి తెలిసిందే.