జూబ్లీహిల్స్, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్, ఏయా హెల్త్ కేర్పేరుతో డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ కుమార్ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. వీరికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ కౌన్సిల్, విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి క్లినిక్ లపై దాడి చేయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులకు కంప్లయింట్ చేయగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
