హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న విన్ ఫాస్ట్ కార్ల షోరూంలో రూ.25 లక్షలు పెట్టి కారు కొంటే 5 కిలోమీటర్లు తిరిగేసరికి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రాయదుర్గంలో ఉన్న విన్ ఫాస్ట్ ఈవీ కార్ల షోరూంలో రూ. 25 లక్షలు పెట్టి కొత్త కారు కొన్నానని.. కొన్న వెంటనే బయటికి తీసుకెళ్తే 5 కిలోమీటర్లకే ఆగిపోయిందని అంటున్నాడు బాధితుడు.
కారు ఆగిపోవడంతో వెంటనే షో రూమ్ కి వచ్చి చెప్పానని... తమకు సంబంధం లేదంటూ షోరూం సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారని అంటున్నాడు బాధితుడు. గట్టిగా ప్రశ్నిస్తే కారు రిపేర్ చేసి ఇస్తామని తీసుకున్నారని... పదిరోజులు దాటుతున్నా తన కారు తిరిగి ఇవ్వట్లేదని అంటున్నాడు బాధితుడు.
►ALSO READ | తెలంగాణ వ్యాప్తంగా 245 విద్యాసంస్థల బస్సులపై కేసులు
కారు రీప్లేస్ చేయమని అడిగితే చెయ్యం అంటున్నారని.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వం అంటున్నారని వాపోతున్నాడు బాధితుడు. స్పేర్ పార్ట్ వచ్చేంతవరకు ఆగితే రిపేర్ చేసి ఇస్తామంటున్నారని తెలిపాడు బాధితుడు. ఇప్పటికే కన్స్యూమర్ కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపానని తెలిపాడు బాధితుడు.
