Lionel Messi: ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026)లో భాగంగా ఈరోజు ( జూన్ 17న తెల్లవారుజామున, బుధవారం) రాత్రికి అల్జీరియాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం.. ఈ ఫిఫా ప్రపంచ కప్ మెస్సికి చివరిదంటూ వార్త కథనాలు వస్తున్నాయి. దీంతో మెస్సిని మైదానంలో చూడాలని భారీగా ఫ్యాన్స్ వెయింటింగ్ చేస్తున్నారు. కొంతకాలంగా కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న లియోనల్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు టాక్. ఇక అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు గుప్పించాడు. ప్రపంచ మొత్తం అతడి కోసం వేచి చూస్తోందని వెల్లడించాడు.
మెస్సి కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్:
అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం లియోనల్ మెస్సిని గ్రౌండ్ లో చూడాలని ఈగర్ గా వెయిటింగ్ చేస్తుంది. అతడు కేవలం మా జట్టుకే కాదు ప్రపంచ ఫుట్‌బాల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.. మెస్సి గురించి చెప్పడానికి ఏమీ లేదు.. అతడు ఎప్పుడూ జట్టుకు అండగా నిలిచాడు.. టీమ్ విజయాల్లో మెస్సి పాత్రే అత్యంత కీలకం అన్నాడు. మెస్సి ఫుట్‌బాల్ దేవుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని స్కలోని చెప్పుకొచ్చాడు.
మెస్సితో కలిసి ఆడటం గర్వంగా ఉంది:
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2022 టైటిల్‌ను అర్జెంటీనా దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే టార్గెట్ తో బరిలోకి మెస్సి సేన దిగబోతుంది. ఈ సందర్భంగా మెస్సి సహచరుడు నికోలస్ ఒటమెండీ మాట్లాడుతూ.. ఖతార్‌లో సాధించిన గెలుపు దేశాన్ని ఒక్కటి చేసిందన్నాడు. ఆ జ్ఞాపకాలు మాకు మరింత బలాన్ని ఇస్తున్నాయి.. అదే పట్టుదలతో మళ్లీ బరిలోకి దిగబోతున్నామని వెల్లడించారు. కానీ, మెస్సితో కలిసి ఆడటం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది.. అతడు అసాధారణ వ్యక్తి.. స్టేడియంలో మెస్సి ఓ యోధుడు కనిపిస్తాడని పేర్కొన్నాడు.
